Coronaను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చండి

ప్ర‌భుత్వాలు బాధ్య‌త‌ను విస్మ‌రించ‌వ‌ద్దు: ఉత్త‌మ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఆసుప‌త్రి నుంచి ట్విట్ట‌ర్‌లో విడియో సందేశం పోస్టు చేశారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకింది. కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపించారు. ఈన ఆరోగ్యం గురించి ప్రార్ధించిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. రెండు మూడురోజుల్లో డిశ్చార్జి అవుతాన‌ని తెలిపారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కరోనా బాధితుల కోసం గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని, వారిని అభినందిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజలు కరోనా బారిన పడితే వారికి వైద్యసేవలు అందక నానా కష్టాలు పడుతున్నారని, బాధాకరమైన విషయమని అన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ లేక ఇబ్బందులు పడుతున్న బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయ‌ని ఉత్త‌మ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.