Corona: కెటిఆర్‌కు పాజిటివ్‌

హైదరాబాద్‌ : దేశంలోనూ.. రాష్ట్రంలోనూ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే ప‌లువురు రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా నిర్ధారణ అయింది.

క‌రోనా నిర్ధార‌ణ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా ఇప్పటికే తెలంగాణ సిఎం కెసిఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

1 Comment
  1. Mallesh Yengani says

    ఈటెల రాజేందర్ సర్ మివంతు వచ్చింది రాష్ట్రాన్ని ఎలాడానికి….

Your email address will not be published.