Corona: మ‌హారాష్ట్రలో కొత్త‌గా 67,160 కేసులు.. 676 మ‌రణాలు

ముంబ‌యి: మ‌హారాష్ట్రలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గ‌త 24 గంట‌ల్లో మ‌హారాష్ట్రలో కొత్త‌గా 67,160 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రి ఆ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 42,28,836కు చేరింది. తాజాగా కొవిడ్ బారి నుండి 63,818 కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్రలో మొత్తం 34,68,610 మంది క‌రోనా బారి నుండి కోలున్నారు. తాజాగా రాష్ట్రంలో 676 మంది కొవిడ్ బాదితులు క‌న్నుమూశారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 63,928కి పెరిగింది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో 6,94,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా ముంబ‌యి న‌గ‌రంలో 5,888 కేసులు కొత్త కేసులు న‌మోదు కాగా.. 71 మంది క‌రోనాతో మృత్యువాత‌ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.