Corona Effect: బీహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మృతి

పట్నా(CLiC2NEWS): కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో సామన్యులే కాకుండా సెలబ్రిటీలు, సినిమానటులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు.. ఇలా పలురురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో కరోనా సోకి పలువురు బలవుతున్నారు. దేశంలో మరణాలు ప్రతి రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇలా కరోనా కాటుకు బలవుతున్న వాళ్లలో సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఇటీవల కరోనా బారినపడ్డ అరుణ్‌కుమార్ సింగ్ పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.