Corona Effect: Mancherial లో మే 1 నుండి 5 వరకు వ్యాపారసంస్థలు బంద్
ప్రకటించిన చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల
మంచిర్యాల (CLiC2NES): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికోసం రాష్ట్రప్రభుత్వం నైట్ కర్ఫ్యూ లాంటి చర్యలు చేపట్టింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో పలు అసోసియేషన్స్ స్వచ్ఛంధంగా తాత్కాలిక బంద్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో మే 1 నుండి మే 5 వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అత్యవసర సేవలు మినహా సంపూర్ణ బంద్‌ను ప్రకటిస్తున్నట్లు చాంబర్ ఆఫ్‌కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షులు గుండ సుధాకర్ గురువారం (CLiC2NES) కి తెలిపారు. పట్టణంలో కేసుల సంఖ్య రోజురోజుకుపెరిగిపోతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని అన్ని అన్నిరకాల వ్యాపార సంస్థలలు (అత్యవసర సర్వీసులైన మెడికల్ షాపులు, పాలు, పండ్లు, హోటళ్లు, కూరగాయాలు, చికెన్‌సెంటర్స్ మినహాయించి) మే 1 నుండి మే 5వ తేదీ వరకు సంపూర్ణ బంద్ ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ బంద్‌కు పట్టణంలోని ప్రజలు, వ్యాపారులు సహకరించాలని చాంబర్ ఆఫ్‌కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షులు గుండా సుధాకర్ కోరారు.
ప్రకటన సారంశం…
“మంచిర్యాల పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తూ.. పట్టణ ప్రజలను, వ్యాపారులను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్న విషయం అందరికి విధితమే. అందరి క్షేమము, వ్యాపరస్తులు, మరియు అందరి కుటుంభ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మంచిర్యాల వారు పట్టణంలోని అన్ని అన్నిరకాల వ్యాపార సంస్థలకు( అత్యవసర సర్వీసులైన మెడికల్ షాపులు, పాలు, పండ్లు,కూరగాయాలు, చికెన్‌సెంటర్స్ మినహాయించి) అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులను సంప్రదించి తప్పనిసరి పరిస్థితులలో మే 1 నుండి మే 5వ తేదీ వరకు సంపూర్ణ బంద్ ప్రకటించడము జరిగింది. ప్రజలు, వినియోగ దారులు మరియు వ్యాపారస్తులు ఈ ఐదు రోజులు పూర్తి బంద్ కు సహకరించగలరని చాంబర్ ఆఫ్‌కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల వారు తెలియజేశారు.“ అని ప్రకటనను విడుదల చేశారు.