త‌మిళ‌నాడులో ఓ ప్రైవేట్ పాఠ‌శాల‌లోని 25 మంది విద్యార్థ‌లకు కరోనా..

చెన్నై(CLiC2NEWS): త‌మిళ‌నాడులో తిరుప్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠ‌శాల‌లోని 25 మంది విద్యార్థ‌లకు కరోనా సోకింది. వారిలో ఇద్ద‌రిని ఆసుప‌త్రిలో చేర్పించారు. మిగ‌తావారు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు.ఒమిక్రాన్ వేరియంట్‌ ఆందోళన నేపథ్యంలో వారి నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఆ పాఠ‌శాల‌లోని మిగ‌తా విద్యార్థుల‌కు, ఉపాధ్యాయుల‌కు, సిబ్బందికి కూడా కొవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. పాఠ‌శాల‌లో శానిటైజేష‌న్ నిమిత్తం పాఠ‌శాల‌ల‌ను వారం రోజుల‌పాటు మూసివేస్తామ‌ని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.