India Corona: కొత్తగా 38,792 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరగాయి. గడిచిన 24 గంటల్లో 38,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 624 మంది కరోనాతో మరణించారు. నిన్న 41వేల మంది కొవిడ్ నుండి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 4,29,946 పాజిటివ్ కేసులున్నాయి. దేశంలో కొత్తగా నమోదవుతున్న కొవడ్ కేసులలో కేరళ, మహారాష్ట్రాలలో అత్యధికంగా ఉన్నాయి. కేరళలో 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రం మరోసారి ఈనెల 17,18 తేదీల్లో పూర్తిస్థయి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.