TS: వైద్య కళాశాలలో 46 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్..

కరీంనగర్ (CLiC2NEWS) : జిల్లాలోని ఓప్రైవేటు వైద్య కళాశాలలో చదువుత్నున్న 46 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. కళాశాలలో వారం రోజుల క్రితం స్నాతకోత్సవం నిర్వహించారని, దీంతో ఒకరినుండి ఇంకొకరికి వైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. మిగతా వారికి నిర్థారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. కరోనా పాజిటివ్‌గగా నిర్థారణ అయిన వారికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో మిగతా విద్యార్థులందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.