21కి చేరిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు
మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు
ముంబయి(CLiC2NEWS): దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది.
నైజీరియా నుండి మహరాష్ట్రకు వచ్చిన మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెలలో ఈ వేరియంట్ సోకిందని గుర్తించారు. ఫిన్లాండ్ నుండి పుణెకు వచ్చిన మరో వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించనట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి ఈ వేరియంట్ నిర్థారణ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరందరు కూడా దక్షిణాఫ్రికానుండి వచ్చినట్లు వెల్లడించింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది.