TS: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. సాధారణ పరీక్షల్లో కారోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా తేలిందని చెప్పారు. తనకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరానని తెలియజేశారు. కొన్ని రోజులుగా తనను కలిసిన సన్నిహితులందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని , తగిన జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఇటీవల పోచారం మనవరాలి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సిఎంలు హాజరైన విషయం తెలిసినదే.