మహిళ కడుపులో కాటన్.. అలాగే వదిలి కుట్లువేశారు!
విశాఖపట్నం (CLiC2NEWS): ఓ మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు మీటర్ పొడవున్న కాటన్ ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. కోరాపుట్ జిల్లా బిరిగుడ గ్రామానికి చెందిన హలబ అనే మహిళ ఒడిశాలోని రాయగడ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని వైద్యులు శస్త్రచికిత్స చేసి కాటన్ కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు.
కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ తీవ్ర కడుపునొప్పితో ఆదే ఆసుపత్రికి వచ్చారు. అక్కడి వైద్యులు అది సాధారణ కడుపు నొప్పని చెప్పి పంపించేశారు. నొప్పి ఎక్కువవడంతో బాధితురాలు మరో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొన్నారు. ఆమె కడుపులో కాటన్ ఉన్నట్లు తెలిపారు. ఆ మహిళకు విశాఖలోని ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి, కాటన్‌ను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యంపై రాయగడ ఆసుపత్రి ఉన్నతాధికారులను వివరణ కోరగా దర్యాప్తునకు ఆదేశించనట్లు పేర్కొన్నారు.