కిక్కిరిసిపోయి కాబుల్ విమానాశ్రయం
ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న ఆఫ్ఘన్లు
కాబూల్ (CLiC2NEWS): తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆ క్రమించుకోవడంతో పలువురు ప్రజలు దేశం విడిచిపారిపోయేందుకు యత్నిస్తున్నారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది దేశాన్ని వీడిపారిపోయేందుకు పరుగులు పెడుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది చాలా మంది మొదట కాబుల్‌కు వలస వచ్చారు. సర్కార్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఇక్కడ ఎక్కువగా ఉన్నారని తాలిబన్లను అడ్డుకుంటారని ప్రజలంతా కాబుల్‌కు వలస వచ్చారు. కానీ తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ప్రజలు హతాశులయ్యారు. ఊహించిన దానికన్నా వేగంగా తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారన్న వార్త తెలుసుకోగానే.. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రి తీసుకొని దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకొన్నారు. దీంతో హమీద్ కర్జారు అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్ కిక్కిరిసిపోయింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఢిల్లీకి చేరిన ఎయిర్ ఇండియా విమానం..
ఎయిర్ ఇండియా విమానం 129 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. రాత్రి 8 గంటల సమయంలో విమానాశ్రయానికి చేరుకుంది. కాబుల్ నుండి ఢిల్లీకి వరుసగా విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా సిబ్బందిని సిద్ధం చేస్తోంది.
Another Saigon moment: chaotic scenes at Kabul International Airport. No security. None. pic.twitter.com/6BuXqBTHWk
— Saad Mohseni (@saadmohseni) August 15, 2021