బెల్లంపల్లి : పెర‌ట్లో గంజాయి సాగు.. ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు

 రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్ (CLiC2NEWS):  బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఒ ఇంటి ఆవ‌ర‌ణ‌లో  గంజాయి మొక్కలను సాగుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా 2 ఇంక్లైన్ ప్రాంతం లోని ఒక ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు అనే అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కుమ్మరి లింగయ్య ఇంటి ఆవరణలో తనిఖీ చేశారు. పెరట్లో (06) గంజాయి మొక్కలు సాగుచేస్తునట్లు గుర్తించారు. గంజాయి మొక్కలను విచారణ నిమిత్తం బెల్లంపల్లి -2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సాగు చేస్తున్న నిందితుడు పరారిలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.