సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్‌లో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు
మందమర్రి (CLiC2NEWS): మందమర్రి సింగరేణి మహిళ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజ్‌లో పోలీసులు సైబర్ మోసాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. సైబర్ క్రైమ్ ఎసిపి వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థులను చైతన్య పరచాలనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను ఏవిధంగా మోసగిస్తున్నారో వివరించారు. ప్రజలు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న డిజిటల్ అరెస్టుకు సంబంధించి.. పోలీసు వారు డిజిటల్ అరెస్ట్ చేయరని, ఒకవేళ అలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్స్ వస్తే ఎలా స్పందించాలో వివరించారు.. అంతే కాకుండా cyber Crime www. cybercrime. gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని వారికి కి సూచించారు.