ఫెయింజ‌ల్ తుపాను: తిరుమ‌ల‌లో విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల‌లో ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు కార‌ణంగా ఘాట్‌రోడ్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఫెయింజ‌ల్ తుపాను ప్ర‌భావంతో ఎపిలో ప‌లుచోట్లు భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల ప్ర‌భావంతో తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డులో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఈ మార్గంలో వాహ‌నాల రాకపోక‌ల‌కు అంత‌రాయం క‌లుగ‌కుండా సిబ్బంది అప్ర‌మ‌త్తం అవుతున్నారు. జెసిబిల‌తో విరిగిప‌డిన బండ‌రాళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గిస్తున్నారు.

ఫెయింజ‌ల్ తుపాను కార‌ణంగా ప‌లు విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. విశాఖ‌-తిరుప‌తి విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు తిరుమ‌ల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప్ర‌ధాన జ‌లాశ‌యాలు నిండాయి. కుమార‌ధార‌, ప‌సుధార‌, ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం జ‌లాశ‌యాల్లోకి పూర్తిస్థాయికి నీటిమ‌ట్టం చేరింది.

Leave A Reply

Your email address will not be published.