కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిఎ 4 % పెంపు

ఢిల్లీ (CLiC2NEWS): ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభావార్త‌. క‌ర‌వు భ‌త్యం 4% పెంచిన‌ట్లు కేబినేట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు మంత్రి పీయూష్ గోయ‌ల్‌ వెల్ల‌డించించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న 46 % డిఎ.. 50 శాతీనికి చేరింది. దీంతో ప్ర‌భుత్వంపై ఏటా రూ. 12,869 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుందని అంచనా. ఇది జ‌న‌వ‌రి 1, 2024 నుండి అమ‌ల్లోకి రానుంది.

గోవా శాస‌న‌స‌భ‌లో షెడ్యూల్డ్ తెగ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్ర‌స్తుతం ఎస్‌టిల‌కు రిజ‌ర్వేష‌న్ సీట్లు లేవు.

ఈశాన్య భార‌తం కోసం రూ. 10 వేల కోట్లతో కొత్త పారిశ్రామిక అభివృద్ధి ప‌థ‌కం ఉన్న‌తికి కేబినేట్ ఆమోదం తెలిపింది.

భార‌త్‌లో కృత్రిమ మేధ అభివృద్ధి, ప‌రిశోధ‌న‌ల కోసం స‌మ‌గ్ర వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసే దిశ‌గా రూ. 10 వేల కోట్ల‌తో ఎఐ మిష‌న్‌కు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.