తిరుపతిలో విషాదం.. ‘డాకుమహారాజ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ రద్దు
అనంతపురం (CLiC2NEWS): బాలకృష్ణ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనంతపరురంఓల గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది. ఈవెంట్ కు ఎపి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. అయితే,
తిరుపతి ఘటన నేపథ్యంలో ఈవెంట్‌ను రద్ద చేసినట్లు సమాచారం.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై హీరో బాలకృష్ణ స్పందించారు. భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.