సామాజిక కార్యకర్త గెయిల్ కన్నుమూత

ముంబయి (CLiC2NEWS): బహుజన రచయిత, సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్ కన్నుమూశారు. శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. తన భర్త, కార్యకర్త భారత్ పటాంకర్‌తో కలిసి ఆమె శ్రామిక్ ముక్తీ దళ్‌ను స్థాపించారు. గెయిల్ ఓంవేద్ వయసు 81 ఏళ్లు. సంగ్లీ జిల్లాలోని కేసేగావ్ గ్రామంలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు.
అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో 1941, ఆగస్టు 2వ తేదీన గెయిల్ జన్మించారు. 1970లో అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్‌డీ చేసేందుకు ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. అయితే గెయిల్ ఇక్కడే స్థిరపడిపోయారు. 1983భారతీయ పౌరసత్వం పొందారు. అంతకు ముందు 1976వ సంవత్సరంలో సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్, ఐడియాలను ఆమె సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేశారు. అంబేద్కర్ స్టడీ కోసమే ఓంవేద్ తన జీవితాన్ని సమర్పించారు. కుల వ్యతిరేక ఉద్యమంలో ఆమె విశేష పాత్ర పోషించారు. ఎన్నో రచనలు చేశారామె. మహిళా, పర్యావరణ సమస్యలపైన కూడా కథనాలు రాశారు.