మంచిర్యాల‌లో ఘ‌నంగా ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

 మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని రామ్‌న‌గ‌ర్  లో దుర్గాదేవి శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ను వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. ఈ శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో అమ్మ‌వారిని రోజుకో రీతిన అలంక రింప‌జేసి నిత్య పూజా కైంక‌ర్యాల‌ను శాస్త్ర ప్ర‌కారం నిర్వ‌హించారు. ఇక్క‌డ నిర్వ‌హించిన ఉత్స‌వాల్లో భ‌క్తులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. దాదాపు 70 మందికి భ‌క్తులు ఈ ఉత్స‌వాల్లో భ‌వానీ దీక్ష‌ను స్వీక‌రించి ప్ర‌తీరోజు పూజాకార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉత్స‌వాల‌ నిర్వాహ‌కులు వొన్నోజుల ర‌మేషాచారి మాట్లాడుతూ..
`దుర్గే దుర్గ‌తి నాశ‌ని` అనే శ్లోకం భ‌క్తుల‌కు శుభాల‌ను క‌ల‌గ‌జేస్తుంద‌ని … ఈ శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌లో దుర్గాదేవిని ద‌ర్శించుకోవ‌డం వ‌ల్ల దుర్గ‌తుల‌ను పోగొట్టి స‌ద్గ‌తుల‌ను ప్రసాదిస్తుంద‌ని, దివ్వ‌రూపిణి అయిన దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం స‌క‌ల శ్రేయోదాయ‌క‌మ‌ని“ ఆయ‌న అన్నారు.

బుధ‌వారం నిర్వ‌హించిన దుర్గాదేవి శోభాయాత్ర వైభ‌వోపేతంగా సాగింది. ఈ శోభాయాత్ర‌లో భ‌వాని భ‌క్తులతో పాటు భ‌క్తులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

కాగా ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించినందుకు డాక్ల‌ర్ వొన్నోజుల న‌రేశ్ శ‌ర్మ‌ని నిర్వాహ‌కులు వొన్నోజుల ర‌మేషాచారి ఘ‌నంగా స‌న్మానించారు. భ‌క్తులంద‌రి స‌మ‌క్షంలో ఆయ‌న‌కు `స‌ల‌ల క‌ళా వాగ్భావ చ‌క్ర‌వ‌ర్తి` అనే బిరుదును ప్ర‌దానం చేశారు.

డాక్ల‌ర్ వొన్నోజుల న‌రేశ్ శ‌ర్మ‌కి `స‌ల‌ల క‌ళా వాగ్భావ చ‌క్ర‌వ‌ర్తి` అనే బిరుదును ప్ర‌దానం చేస్తున్న వొన్నోజుల ర‌మేషాచారి
Leave A Reply

Your email address will not be published.