40 ఎకరాల భూమి రాయించుకుని 90ఏళ్ల తల్లిని అనాథగా వదిలేసిన కూతుళ్లు
కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు బాలనాగమ్మ

మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ వున్నాడో కాయాన్ని కంటికి కానరాడు
ఈ మాటలు వింటుంటే నేటి పరిస్థితులు ముందే ఆకళింపు చేసుకుని రచయిత అందే శ్రీ రాసినట్టు అనిపిస్తోంది. ఇవాల్టి రోజున క్షణిక, కామ సుఖాల కోసం తమ జీవితాలనే కాక కన్నతల్లిని కూడా పట్టించుకోవడంలేదు. కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు వృద్ధులు అవ్వగానే చిన్నపిల్లల్లా చూసుకోవాల్సిన బిడ్డలు అనాథల్లా వదిలేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఇక్కడ ఓ వృద్ధురాలైన తల్లి నుంచి ఆస్థి తీసుకుని ఆపై తల్లిని పట్టించుకోకుండా వదిలేశారు కుమార్తెలు. దీంతో చేసేదేమీ లేక ఆ 90 యేళ్ల వృద్ధురాలు న్యాయం కోసం కలెక్టర్‌ను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు బాలనాగమ్మకు నలుగురు కుమార్తెలు. అయితే ఈ వయసులో తనను తన కూతుళ్లు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకుంది. బాలనాగమ్మ కలెక్టర్‌కు పెట్టుకున్న దరఖాస్తులో…
బాలనాగమ్మకు నలుగురు కుమార్తెలు.. ఇప్పటికే తన పేరుపై ఉన్న 50 ఎకరాల భూమిలో 40 ఎకరాలు వారిపేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుండి ఆ తల్లిని పట్టించుకోవడం మానేశారు ఆ కూతుళ్లు.. పైగా బాలనాగమ్మ పేరుమీద ఉన్న మిగతా 10 ఎకరాల భూమిని కూడా వారి పేర్లమీద రాయమని తీవ్ర ఒత్తడికి గురిచేస్తున్నారు కూతుళ్లు.. దానికి ఆ వృద్ధురాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక బాలనాగమ్మ జిల్లా కలెక్టర్‌ను న్యాయం చేయాలని కోరింది. తన ఆస్తి మొత్తం తీసుకొని తనను పట్టించుకోవడంలేదని.. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరింది.
ఈ కేసుని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుని వెంటనే విచారించి నివేదిక సమర్పించాలని మానవహక్కుల కమిషన్ కు కర్నూలు ఆర్డీవో హరి ప్రసాదు ను ఆదేశించింది.
Wow, amazing blog format! How lengthy have you been running a blog for? you made blogging look easy. The overall glance of your website is great, let alone the content material!!