రూ.కోటి నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వర దేవికి అలంకరణ
భీమవరం {CLiC2NEWS} : భీమవరంలోనీ త్యాగరాజ భవనంలో కొలువుదీరిన వాసవీ కన్యకా పరమేశ్వర దేవిని రూ. కోటి నోట్లతో ప్రత్యేకాలంకారణ చేశారు. ఆర్యవైశ్య వర్తక సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో దేవికి కోటి రూపాయలని దండలగా అలంకరించి, ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.