శాంతి స్వరూప్‌తో కలిసి ‘ప్రజలతో ముఖ్యమంత్రి’.. చంద్రబాబు

హైదరాబాద్ (CLiC2NEWS): శాంతి స్వరూప్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు వార్తలు అనగానే మొదట గుర్తొచ్చేది ఆయనేనన్నారు. మేమిద్దరం కలిసి ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం చేశామని గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో పోస్టక్ష చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రతి సోమవారం ప్రజలతో ముఖ్యమంత్రి ప్రోగ్రాం చేశామని.. అది ఆరేళ్ల పాటు కొనసాగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందేవారన్నారు. మా అనుబంధం సుదీర్ఘమైందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు.
శాంతి స్వరూప్ మృతిపై బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం తెలియజేశారు. టివిల్లో వార్తలు చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారని.. మీడియా రంగంలో తనదైన ముద్రవేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.