ఎయిర్ ఇండియాలో పోస్టులు
ఢిల్లీ, ముంబయిలోని ఎయిర్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లలో ఆఫీసర్- సెక్యూరిటి , జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఢిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్.. 27 పోస్టులు కలవు.
ఆఫీసర్ -సెక్యూరిటి 20
జూనియర్ ఆఫీసర్ -సెక్యూరిటి పోస్టులు 7 ఉన్నాయి.
ముంబయిలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్.. ఇంటర్నేషనల్ కార్గో వేర్‌హౌస్లో 145 పోస్టులు కలవు.
ఆఫీసర్ -సెక్యూరిటి 65
జూనియర్ ఆఫీసర్ -సెక్యూరిటి పోస్టులు 80 ఉన్నాయి
పోస్టును అనుసరించి డిగ్రీతో పాటు ఎవిఎస్ ఇసి కోర్సు సర్టిఫికెట్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సి టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జనవరి 6,7,8 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం రూ.500 డిమాండ్ డ్రాప్ట్ ద్వారా చెల్లించాలి. ఎస్‌సి/ ఎస్‌టి/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.
ఆఫీసర్ – సెక్యూరిటి పోస్టులకు నెలకు రూ. 45వేలు వేతనం అందుతుంది. వయస్సు 50 ఏళ్లకు మించరాదు. జూనియర్ ఆఫీసర్ – సెక్యూరిటి పోస్టులకు నెలకు రూ. 29,760 వేతనం అందుతుంది. వయస్సు 45 ఏళ్లకు మించరాదు.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:
ముంబయి: ఎఐ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, జిఎస్‌డి కాంప్లెక్స్, సిఐఎస్ ఎఫ్ గేట్ నెం.5, సహర్, అందెరి ఈస్ట్ , ముంబయి.
ఢిల్లీ: ఎఐ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, రెండో అంతస్తు, జిఎస్‌డి బిల్డింగ్ , ఎయిర్ ఇండియా కాంప్లెక్స్, టెర్మినల్ -2 , ఐజిఐ ఎయిర్‌పోర్ట్ , న్యూఢిల్లీ.
పూర్తి వివరాలకు https://www.aiasl.in/ వెబ్‌సైట్ చూడగలరు.