ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ రిపోర్టులో కవిత పేరు..!

ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడి అమిత్ ఆరోరాను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఈడి అధికారులు టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, ఎంపి మాగుంట నియంత్రించారని ఈడి పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లు విజయ్ నాయర్‌కు అందాయని తెలిపింది. ఈ విషయాన్ని అమిత్ ఆరోరా ధ్రువీకరించారని రిపోర్టులో వెల్లడించారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 36 మంది వద్ద ఉన్న 170 ఫోన్లు ధ్వంసం చేశారని.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వద్ద 33 ఫోన్లు ధ్వంసమైనట్లు తెలిపారు. మొత్తం ధ్వంసమైన ఫోన్ల విలువ రూ. 138 కోట్లు ఉంటుందన్నారు. వీటిలో కవితకి చెందినవి 10 ఫోన్లు ఉన్నాయని, రెండు నంబర్లకు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడి అధికారలు తెలిపారు.