జనసేన ఎమ్మెల్యేలతో భేటీ అయిన డిప్యూటి సిఎం
విజయవాడ (CLiC2NEWS): విజయవాడ జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేశ్‌తో పాటు పార్టి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభ వ్వవహారాలపై వారికి జనసేనాని అవగాహన కల్పించారు. సభ నియమావళిని తెలియజేసినట్లు సమాచారం. సభకు వచ్చేముందు నియోజకవర్గంలో సమస్యలను అధ్యయనం చేసి రావాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్ దీక్షవస్త్రాలు ధరించి పాల్గొన్నారు. ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా అయన పండ్లు , ద్రవాహారం మాత్రమే తీసుకంటారు.