AP: గిరిజనులతో కలసి నృత్యం చేసిన డిప్యూటి సిఎం పుష్ప శ్రీవాణి

విజయనగరం (CLiC2NEWS) : ఎపి డిప్యూటి సిఎం, గిరిజన శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆదివాసి దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్ల్యే జోగారావు, ఎమ్మల్సీ రఘువర్మ, కలెక్టర్ సూర్యకుమారి, సబ్ కలెక్టర్ భావన, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మల్ల్యే జోగారావు డప్పు కొట్టి అందరిని ఉత్సాహపరిచారు.