వ్యాస రచన పోటీలో విజేతలకు పురస్కారాలు అందచేసిన డిజిపి మహేందర్ రెడ్డి
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా వ్యాస రచన పోటీలు

హైదరాబాద్ (CLiC2NEWS): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (ఫ్లాగ్ డే ) సందర్బంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన పోలీసు అధికారులకు డిజిపి ఎం. మహేందర్ రెడ్డి నేడు నగదు పురస్కారాలను అందచేశారు. ఈ పోటీలను రెండు విభాగాలలో నిర్వహిచారు. డిజిపి కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ బహుమతుల ప్రధానం చేయటం జరిగింది.
విజేతలకు ప్రధమ బహుమతిగా రూ. 20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తృతీయ బహుమతిగా రూ. 10 వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో సిఐడి విభాగం డిజి గోవింద్ సింగ్, అడిషనల్ డిజిలు జితేందర్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, విజయ కుమార్, నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Welzard’s original cellphone novel on the Everystar web site
inspired Murase’s manga adaptation.