Hyderabad: బతుకమ్మ చీరల పంపిణీ షురూ..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని ఆడపడుచులకు సర్కార్ బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించింది. నేటి నుండి 13వ తేదీ వరకు చారల పంపిణీ కొనసాగనుంది. హైదరాబాద్ నగరంలో 481 కేంద్రాల్లో సుమారు 9 లక్షలకు పైగా చీరలను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. బతుకమ్మ చీరలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిహెచ్ ఎంసి యుసిడి విభాగం ఏర్పాట్లను పూర్తిచేసింది.