Mancherial: గిరిజనులకు దప్పట్ల పంపిణి
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/gummadi-foundation.jpg)
జన్నారం (CLiC2NEWS): మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో గుమ్మడి రాజలింగు ఫాండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణి చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఈ కార్యక్రమంలో నిర్వహించారు. జన్నారం మండలంలోని అల్లీనగర్ ,దొంగ పల్లి ,మల్యాల్ తదితర గిరిజన గ్రామాల్లో దాదాపు 700లకు పైగా దుప్పట్లను పంపిణి చేయడంల జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి కిరణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడి రాజలింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ మండలంలోని నిరుపేద గిరిజనులకు శీతాకాలంలో దప్పట్లు పంపిణి చేయడం శుభపరిణామం అన్నారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి స్వప్న, ఒయు విద్యార్థులు శ్రీనివాస్, కిరణ్ , డబ్యుసిఎస్ ఇండియా ప్రతినిధి వెంకట్, గ్రామ సర్పంచ్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/gummadi-foundation2.jpg)