తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా టీకాల పంపిణీ: హరీశ్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా కరోనా బూస్టర్‌డోస్ టీకా పంపిణీ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి హరీశ్‌రావు చార్మినార్ యునానీ దావఖానలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102% పూర్తయిందని, టీకా పంపణీలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. 12 నుండి 18 సంవత్సరాల పిల్లలకు 38% మొదటి డోసు వేశామని వెల్లడించారు.
టీకా విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. బూస్టర్ డోస్‌తో ప్రయోజనాలు ఉన్నాయని, అర్హులంతా టీకా వేయించుకోవాలని సూచించారు.