జిల్లా సబ్ జూనియర్ క్రీడా పోటీలను విజ‌యవంతం చేయాలి

కొత్తగూడెం (CLiC2NEWS): భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సాధన మైదానంలో జరుగనున్న జిల్లా అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల‌ని నిర్వాహ‌కులు కోరారు . ప్రతిభ కనబరిచన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు పాల్గొని విజేత‌ల‌కు బహుమతులు అంద‌జేస్తార‌ని తెలియ‌జేశారు. క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినద‌ని జిల్లా అథ్లెటిక్స్ మీట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు 9వ వార్డ్ కౌన్సిలర్ మోరే రూప తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ మహీధర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు మోరె భాస్కర్ మరియు అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు వి. వి. రావు, మల్లికార్జున, వేణు, నాగేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

.

1 Comment
  1. Bunny says

    Jai MBR Jai Jai MBR

Leave A Reply

Your email address will not be published.