పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి..: వాపక్షాల డిమాండ్
మంథని మండలం అడవి సోమనపల్లి బ్రిడ్జిపై సిపిఐ సిపిఎం రాస్తారోకో
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/MMT-CPM-CPI.jpg)
మంథని (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి బ్రిడ్జిపై సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి పోడు భూముల గ్రామాలలో పర్యటించి అక్కడే కుర్చీ వేసుకుని వాళ్లకు పట్టాలు ఇస్తా అని చెప్పిన కెసిఆర్ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హరితహారం పేరుతో గిరిజనుల దగ్గర పోడు భూములు లాక్కొని ఫారెస్ట్ అధికారుల చే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అడవి విస్తీర్ణం పేరుతో రెక్కాడితే కానీ డొక్కాడని గిరిపుత్రుల భూములు లాక్కోవడం దారుణమని అని అన్నారు. భూస్వాముల మిగులు భూములను ఇతర ప్రభుత్వ భూములను బంజరు భూములను లాక్కోకుండా పేదల భూమి లే లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు . మంథని నియోజకవర్గంలో మూడు గ్రామాల సమస్యలను పరిష్కరించి గిరి పుత్రులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ నాయకులు ఆర్ల సందీప్ స్వామి ,రవి ,సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం జిల్లా నాయకులు దినేష్, మోహన్ , మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ పుపాల సత్యనారాయణ నాయకులు ప్రీతం ,రామ్ చందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.