గణేశ్ నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం తాగునీటి శిబిరాలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/jalamandali-free-water-services.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): వినాయక నిమజ్జన శోభయాత్రను వీక్షించేందుకు తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి తాగునీటి శిబిరాలను ఏర్పాట్లు చేసింది. ఓఆర్ ఆర్ పరిధిలో భక్తుల కోసం 196 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తం 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వాటర్ ప్యాకెట్లే కాకుండా అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచనుంది.
నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్నదాన శిబిరాలకు ఉచితంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది.
అదేవిధంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే అన్ని రూట్లలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాటర్ లీకేజీలు, సివరేజీ ఓవర్‌ఫ్లోలు లేకుండా జలమండలి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టింది.