సోమ‌వారం న‌గ‌రంలో తాగునీరు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌కు సోమ‌వారం తాగునీరు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో క‌ల‌బ్ గూర్ నుంచి ప‌టాన్ చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీలు ఏర్ప‌డ్డాయి. ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. కావున 11వ తేదీ ఉద‌యం 6 గంట‌ల నుండి 12వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలగ‌నుంది.

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు

ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్,  బీరంగూడ‌, అమీన్ పూర్, ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, మూసాపేట్, జ‌గ‌ద్గిరిగుట్ట‌.

పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోరుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.