రేపు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

తేది: 23.10.2024

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం తాగునీరు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. కృష్ణా డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై ఫేజ్-3 లోని 2375 ఎంఎం డ‌యా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కు లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరిక‌ట్ట‌డానికి మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేయ‌నున్నారు. అందువ‌ల‌న గురువారం ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లో 24 గంట‌లు వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు

అంతరాయం ఏర్ప‌డే ప్రాంతాలు

శాస్త్రిపురం, బండ్ల‌గూడ‌, భోజ‌గుట్ట‌, షేక్ పేట్, ఆళ్ల‌బండ‌, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ న‌గ‌ర్, ప్ర‌శాస‌న్ న‌గ‌ర్, త‌ట్టిఖానా, లాలాపేట్, సాహేబ్ న‌గ‌ర్, ఆటో న‌గ‌ర్, స‌రూర్ న‌గ‌ర్, వాస‌వి రిజ‌ర్వాయ‌ర్లు, సైనిక్ పురి, మౌలాలి, గ‌చ్చిబౌలి, మాదాపూర్, అయ్య‌ప్ప సొసైటీ, కావురి హిల్స్, స్నేహ‌పురి, కైలాస‌గిరి, దేవేంద్ర న‌గ‌ర్, మ‌ధుబ‌న్, దుర్గా న‌గ‌ర్, బుద్వేల్, సులేమాన్ న‌గ‌ర్, గోల్డెన్ హైట్స్, 9 నంబ‌ర్, కిస్మ‌త్ పూర్, గంధం గూడ‌, బోడుప్ప‌ల్, మ‌ల్లికార్జున న‌గ‌ర్, మాణిక్ చంద్, చెంగిచెర్ల‌, భ‌ర‌త్ న‌గ‌ర్, పీర్జాదిగూడ‌, పెద్ద అంబ‌ర్ పేట్, ధ‌ర్మ‌సాయి (శంషాబాద్).

 

Leave A Reply

Your email address will not be published.