నగరంలో రేపు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాలలో రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ – 8, 15 పరిధిలోని లింగంపల్లి, పటాన్ చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు శనివారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. ఓ అండ్ ఎం డివిజన్ నం. 8, 15 పరిధిలో కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
పటాన్ చెరు, ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట్, డోయెన్స్ కాలనీ, SBI ట్రైనింగ్ సెంటర్, BHEL ఫాక్టరీ, టౌన్ షిప్, HCU, పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతం.