డ్రైవర్ నిర్లక్ష్యం .. పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..
మేడ్చల్ (CLiC2NEWS): డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేటు స్కూల్ బస్సు పోలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బండమాదారం వద్ద చోటుచేసుకుంది. బస్సులో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. నిద్ర మత్తులో డ్రైవర్ బస్సు నడపడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. విద్యార్థులందరూ సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.