Driving license: గడువు మరో 3 నెలలు పొడిగింపు

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్‌మెంట్ సర్టిఫికెట్ల గడువును మరో 3 నెలలపాటు కేంద్ర సర్కార్ పొడిగించింది.
పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ తదితర ఆనిబంధనల నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు గడువును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగించింది.
మోటారు వాహనాల చట్టం (1988), కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (1989) పరిధిలోకి వచ్చే అన్నిరకాల పత్రాల గడువును ఈ మేరకు పెంచినట్లు కేంద్రం స్పష్టం చేసింది.