AP: 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు
అమరావతి (CLiC2NEWS) :ఏపీ ప్రభుత్వం తాజగా 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను క్యాలెండర్లో పెర్కొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ..ఎన్నో సంవత్సరాలనుండి ఎదురునచూస్తున్న నిరుద్యోగులు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. గడిచిన రెండు సంవత్సరాలలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలియజేశారు.
