అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా..

మంగళగిరి (CLiC2NEWS): ఖాళీ ప్రదేశాల్లో గంజాయి, మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని గుర్తించేందుకు పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా నిందితులను గుర్తించడం సులువు అవుతుందని పోలీసులు వెల్లడించారు. మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద ఖాళీ ప్రదేశాల్లో డ్రోన్ సాయంతో గాలింపు చేపట్టారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని సూచించారు.