DRT: బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా విజయ్‌కుమార్. జనరల్ సెక్రటరిగా శ్రీథర్ రెడ్డి ఎన్నిక

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని అబిడ్స్‌లో ఉన్న డిఆర్‌టి కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సీనియర్ న్యాయవాది టి. విజయ్‌కుమార్ .. ఉపాధ్యక్షుడిగా కల్యాణ్ చక్రవర్తి ఎన్నికయ్యారు.
జనరల్ సెక్రటరి గా టి. శ్రీథర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా నరేష్ అనుగుల, ట్రెజరర్ గా ఎస్.శ్రీకాంత్, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరిగా జి. కిరణ్ రాజ్, లైబ్రేరియన్ గా ఎ . తనూజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ (మేల్) కె. సురేష్, క్రాంతి కుమార్, పి. బాబు సాయినాథ్ రావు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఫిమేల్) జి. జెస్సిక, మౌనిక ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి న్యాయవాదులంతా అభినందనలు తెలియజేశారు.

అనంతరం మాజీ ప్రెసిడెంట్ జి కె Deshpande నివాసానికి వెళ్ళి ఆయనకు ఎన్నికల్లో గెలుపొందిన ప్రెసిడెంట్ టి.విజయ్‌కుమార్ , ఉపాధ్యక్షు డు కల్యాణ్ చక్రవర్తి, జనరల్ సెక్రటరి టి. శ్రీథర్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు