5.2 తీవ్ర‌త‌తో తుర్కియేలో భూకంపం..

Earthquake: తుర్కియేలో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 5.2గా న‌మోదైంది. తుర్కియోలోని కొన్యా ప్రావిన్స్‌లోనికులు జిల్లా కేంద్రానికి 14 కిలోమీట‌ర్ల దూరంలో భూమి కంపించిన‌ట్లు స‌మాచారం. దీంతో దేశ రాజ‌ధాని అంకారాతో పాటు స‌మీపంలో ఉన్న ప‌లు న‌గ‌రాల్లో భూమి కంపించింది. భ‌య‌బ్రాంతుల‌తో ప్ర‌జ‌లు ఇళ్లు, ఆఫీసుల నుండి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. గ్రీస్‌లో బుధ‌వారం భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త 6.1గా న‌మోదైంది. ప్ర‌పంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభ‌వించే దేశాల్లో తుర్కియే ఒక‌టి. 2023లో తుర్కియే , సిరియాలో భూకంపం వ‌చ్చిన సంగతి తెలిసిందే. అది ఆదేశాల‌లో వినాశ‌నం సృష్టించింది. 50వేల‌కు పైగా ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.