తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్

ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ బాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 18వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. 19వ తేదీన నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణ కు తుది గడువు నవంబర్ 21గా పేర్కొన్నారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహిస్తారు. 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరగుతుంది.
గత ఏడాది డిసెంబర్ 15న జరిగన రోడ్డు ప్రమదాంలో యుటిఎఫ్ నేత షేక్ బాబ్జి ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందారు. ఆయన పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉండటంతో ఇక్కడ ఉప ఎన్ని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.