రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి

హైద‌రాబాద్ (CLiC2NEWS): జూన్ 2వ తేదీన నిర్వ‌హించ‌బోయే తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఇసి) అనుమ‌తినిచ్చింది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అదే రోజు గ‌న్‌పార్క్‌లోని అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద సిఎం రేవంత్‌రెడ్డి నివాళుల‌ర్పించ‌నున్నారు. ఇసి నుండి అనుమ‌తి ల‌భించడంతో జూన్ 2 వ తేదీన వేడుక‌ల‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.