ఎపి అధికారులతో ఇసి బృందం భేటీ..
విజయవాడ (CLiC2NEWS): అంధ్రప్రదేశ్ అధికారులతో కేంద్ర ఎన్నికల బృందం సమావేశమైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటెల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. జిల్లాల వారిగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు , అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షలు ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్ డిప్యూటి ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటి ఎన్నికల కమిషనర్లు ఆర్కె గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బాదో తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.