ఎపిలో తెరుచుకున్న విద్యాసంస్థలు
అమరావతి (CLIC2NEWS): రాష్ట్రవ్యాప్తంగా నేడు (సోమవారం) విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో… గత ఏప్రిల్ 20న మూతపడిన పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలు కూడా తెరుచుకున్నాయి. ఈ క్రమంలో ఎపి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలల్లో నిర్వాహకులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులను గుమికూడకుండా చూడాలని ప్రభుత్వం నిర్దేశించింది. గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని సూచించింది. కరోనా కేసులు 10 శాతం లోపు ఉన్న ప్రాంతాల్లోనే విద్యాలయాలను తెరవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ 1 నుంచి 10 వ తరగతితోపాటు ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకు కూడా బోధనలు జరగనున్నాయి. పాఠశాలల్లో మాస్కు, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
మరో వైపు పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠశాల విద్యావ్యవస్థ ఆరు భాగాలుగా మారనుంది.