తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి చొప్పున పెరగనున్నాయి. ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీనుండి అమలులోకి వస్తాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ టి. శ్రీరంగారావు తెలిపారు. డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు కమిషన్ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుందని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ టారిఫ్ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదని, డిస్కమ్‌లు నవంబరు 30లోపు ప్రతిపాదనలు కమిషన్ ముందుంచాలని ఆదేశింనట్లు వెల్లడించారు.
పెరిగిన ధరలు ఇలా..
ఎల్టి-1ఎలో 51 నుండి 100 యూనిట్ల వరకు రూ. 2.60 నుండి రూ. 3.10కు పెంపు
ఎల్టి-1బిలో 100 యూనిట్లకు రూ. 3.30 నుండి రూ. 3.40కు పెంపు
ఎల్టి-1బి(2)లో 400 నుండి 800 యూనిట్ల వరకు రూ. 9 నుండి రూ. 9.50కు పెంపు
ఎల్టి-1బి(2)లో 400 నుండి 800 యూనిట్ల వరకు రూ. 9 నుండి రూ. 9.50కు పెంపు
ఎల్టి-1బి(2)లో 800 యూనిట్లకు పైగా రూ. 9.50 నుండి రూ. 10కు పెంపు
ఎల్టి-2లో 500 యూనిట్లకు పైగా రూ. 10 నుండి రూ. 11కు పెంపు
ఎల్టి-2 బిలో 301 నుండి 500 యూనిట్ల వరకు పైగా రూ. 9.40 నుండి రూ. 10.40కు పెంపు
ఎల్టి-2 సిలో విభాగంలో యూనిట్ ధర రూ. 12 నుండి రూ. 13కు పెంపు