Free, Fair and peacefull Elections జరిగేలా చూడాలి: సిపి రెమా రాజేశ్వరి

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS):
Free, Fair and peacefull Elections జరిగేలా చూడాలని రామంగుండం సిపి రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి పెద్దపల్లి జోన్ డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల జోన్ డిసిపి సుధీర్ కేకన్ లతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి నేర సమీక్ష సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలల లో ఫంక్షనల్ వర్టికల్స్ లో ప్రతిభ కనబరిచిన 02-ఇన్స్పెక్టర్స్ ,15- ఎస్ ఐ లు,10 -ఎఎస్ఐ లు,27 -హెడ్ కానిస్టేబుల్,76- కానిస్టేబుల్ లకి రివార్డు మేళా నిర్వహించి రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ప్రశంస పత్రం అందజేశారు.
సమావేశంలో UI కేసులు, గ్రేవ్ UI లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం పై సమీక్షా.. SC/ST UI కేసులు, విమెన్ ఎగైనెస్ట్ కేసులు, POCSO కేసుల పరిష్కారం, కన్వెన్షన్ పై సమీక్షా.. NDPS యాక్ట్ కేసుల, NHRC, SHRC మరియు మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ .. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులోఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని,పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలొ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్ ఐపిఎస్, అడిషనల్ డీసీపీ ఏఆర్ రియాజ్ హుల్ హాక్, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు, పెద్దపల్లి ఎసిపి మహేష్ , మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, జైపూర్ ఎసిపి మోహన్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్ సి ఎస్ సి పి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు,సైబర్ క్రైమ్ ఎసిపి రాజేష్ ఈవో నాగమణి, ఏ ఆర్ ఏసిపిలు సుందర్రావు, మల్లికార్జున్, ఇన్స్పెక్టర్ లు, సీఐ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది