వైఎస్ఆర్‌సిపికి రాజీనామా చేసిన ఏలూరు నగర మేయర్ నూర్జహాన్
Eluru Mayor resigned from YSRCP

ఏలూరు (CLiC2NEWS): వైఎస్ ఆర్‌సిపికి ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ రాజీనామా చేశారు. మేయర్ దంపతులు టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. వారితో పాటు పలువురు కార్పొరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.