ఏలూరు: వరద నీటిలో నిలిచిపోయిన పాఠశాల బస్సు

ఏలూరు (CLiC2NEWS): బుట్టాయగూడెం పరిధిలోని జైనవారిగూడెం సమీపంలోని కాలువలో ఓ పాఠశాల బస్సు నిలిచిపోయింది. గమనించిన స్థానికులు ట్రాక్టర్లు సహాయంతో బయటకు లాగారు. బస్సులో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు గ్రామాలు జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుట్టాయగూడెం మండలం కామవరం అడవిలోని గుబ్బలమంగమ్మ గుడి వద్దకు భారీగా నీరు చేరింది. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు సహితం వరద నీటిలో చిక్కుకున్నట్లు సమాచారం. ఆలయ సమీపంలోని మంగమ్మ వాగు పొంగి ప్రవహించడంతో భక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా ఉంది. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ పాఠశాల బస్సు నీటిలో నిలిచిపోయింది. విద్యర్థులకు ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.